సమాజశ్రేయస్సే పోలీస్‌ లక్ష్యం | police target is to serve the public | Sakshi
Sakshi News home page

సమాజశ్రేయస్సే పోలీస్‌ లక్ష్యం

Mar 1 2017 10:20 AM | Updated on Sep 5 2017 4:56 AM

సమాజశ్రేయస్సే పోలీస్‌ లక్ష్యం

సమాజశ్రేయస్సే పోలీస్‌ లక్ష్యం

కుటుంబం కన్నా సమాజ శ్రేయస్సే లక్ష్యంగా పని చేసేది పోలీసులు మాత్రమేనని ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు

 

► జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ
► అడిషనల్‌ ఎస్పీ, ఎస్‌బీ డీఎస్పీ పదవీవిరమణ  

కర్నూలు: కుటుంబం  కన్నా సమాజ శ్రేయస్సే లక్ష్యంగా పని చేసేది పోలీసులు మాత్రమేనని ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. అడిషనల్‌ ఎస్పీ (అడ్మిన్‌) శివరామప్రసాద్, స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీ ఏజీ కృష్ణమూర్తి, నంద్యాల పీసీఆర్‌ ఎస్‌ఐ అబ్దుల్‌సలాం, నంద్యాల యూనిట్‌కు చెందిన హోంగార్డు దేవదాసు తదితరులు పదవీవిరమణ పొందారు.  కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మంగళవారం  ఎస్పీ  ఆధ్వర్యంలో మన కుటుంబం పదవీవిరమణ కార్యక్రమం పేరుతో  వేడుకలు నిర్వహించారు.  పదవీవిరమణ పొందిన అధికారులను శాలువాలు, పూలమాలలతో సత్కరించి జ్ఞాపిక, బహుమతులను అందజేశారు. 

కార్యక్రమంలో ఎస్పీ సతీమణి ఆకే పార్వతి, కూతురు, కుమారుడు దీక్షిత, హేమకేషు పాల్గొన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబాలతో సంతోషంగా జీ వితం గడపాలని వారికి ఎస్పీ సూచించారు.విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంటు ప్రాం తీయ అధికారి శివకోటి బాబురావు, ఓఎస్‌డీ రవిప్రకాష్, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు రమణమూర్తి, జె.బాబుప్రసాద్, మురళీధర్, వినోద్‌కుమార్, రాజశేఖర్‌రాజు, హుసేన్‌పీరా, వెంకటాద్రి, సీఐలు ములకన్న, సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, ఆర్‌ఐ రంగముని, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement