తిరుపతిని జల్లెడ పడుతున్న పోలీసులు | police intensified checks in Tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతిని జల్లెడ పడుతున్న పోలీసులు

Dec 6 2015 1:55 PM | Updated on Aug 21 2018 6:22 PM

తిరుపతి నగరంలో ఆదివారం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.

తిరుపతి నగరంలో ఆదివారం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.  బ్లాక్‌డే(డిసెంబర్ 6), నక్సల్స్ వారోత్సవాలు, తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుపతిలో రక్షణ చర్యలు పటిష్టం చేశారు. సత్యనారపురం, జీవకోన, కొర్లగుంట, నవోదయకాలనీతో పాటు పలు ప్రాంతాల్లో అనుమానితులను అదుపులోకి విచారిస్తున్నారు. ఎలాంటి ఐడెంటిటీ కార్డులు లేని వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఈ తనిఖీల్లో డీఐజీ సత్యనారాయణ, జిల్లా అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి లు స్వయంగా పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement