పోలీసుల కాఠిన్యం

Police Harassed Patient Couple in PSR Nellore - Sakshi

ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్‌ అంటే..

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌) : ఫ్రెండ్లీ పోలీస్‌లుగా ప్రజలతో వ్యవహరించాలని పోలీసు ఉన్నతాధికారులు పలుమార్లు తెలియజేస్తున్నా వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదనే ఆరోపణలున్నాయి. జిల్లాలోని రాపూరు ప్రాంతానికి చెందిన, రాపూరు నరసింహరావు, లక్ష్మమ్మ వృద్ధ దంపతులు. లక్ష్మమ్మ కొన్ని సంవత్సరాలనుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. వారానికి రెండు రోజులు మంగళ, శుక్ర వారాల్లో నెల్లూరు చింతారెడ్డిపాళెంలోని నారాయణ ఆస్పత్రిలో క్రమం తప్పకుండా డయాలసిస్‌ చేసుకోవాల్సి ఉంది. ప్రతి వారం రెండు రోజులు నెల్లూరుకు వచ్చి చికిత్స చేయించుకుని వెళ్తుండేవారు. ఈ క్రమంలో శుక్రవారం కూడా రాపూరులోని వారి బంధువులకు చెందిన కారులో, నారాయణ ఆస్పత్రికి వచ్చి డయాలసిస్‌ చేసుకుని తిరిగి రాత్రి రాపూరుకు వెళుతుండేవాడు.

నగరంలోని ఆనం వెంకటరెడ్డి విగ్రహం వద్దకు చేరుకోగా, ప్రమాదవశాత్తు, ముందు వెళ్తున్న ఓ స్కూటరిస్టును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే స్కూటర్‌లో ప్రయాణిస్తున్న పోలీసుశాఖకు చెందిన దంపతులు కింద పడ్డారు. దీంతో ఆగ్రహించిన ఆ పోలీసు డ్రైవర్‌ను బలవంతంగా కారులోంచి బయటకు లాగాడు. కారులో ప్రయాణిస్తున్న లక్ష్మమ్మ, నరసింహరావు కుమారుడు శ్రీనివాసులు ఎంతో బతిమిలాడారు. తన తల్లి ఆరోగ్యం సరిగా లేదని, డ్రైవర్‌ను తీసుకుపోతే, తన తల్లి పరిస్థితి విషమిస్తుందని వేడుకున్నారు, సదరు ఆ పోలీసు పట్టించుకోకుండా, కారు డ్రైవరు ఎస్‌కె.సలామ్‌ను సీసీఎస్‌కు తీసుకెళ్లాడు. గంట సేపు కారులోనే అనారోగ్యంతో ఉన్నా లక్ష్మమ్మను చూసి స్థానికుల మనస్సు కలచివేసింది. గంట తరువాత పోలీసులు డ్రైవర్‌ను విడిచి పెట్టారు. అయితే ఫ్లెండ్లీ పోలీసు అంటే ఇలాగు ఉంటారా అని స్థానికులు చర్చించుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top