ట్రాక్టర్పై పేకాటరాయుళ్లు ఊరేగింపు | Police Attacks on Gambling Club in kolimigundla, kurnool district | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్పై పేకాటరాయుళ్లు ఊరేగింపు

Dec 23 2014 5:31 PM | Updated on Aug 21 2018 6:12 PM

కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని పేకాట క్లబ్పై మంగళవారం పోలీసులు ముకుమ్మడి దాడులు నిర్వహించారు.

కర్నూలు: కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని పేకాట క్లబ్పై మంగళవారం పోలీసులు ముకుమ్మడి దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా 50 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పేకాటరాయుళ్ల వారి వద్ద నుంచి భారీగా నగదు, సెల్ ఫోన్లుతోపాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం పేకాటరాయుళ్లను ట్రాక్టర్పై ఊరేగిస్తూ... పోలీసు స్టేషన్కు తరలించారు. కొలిమిగుండ్లలో పేకాటరాయుళ్లు నిత్యం పేకాట క్లబ్లో కాలం వెళ్లబుచ్చుతున్నారు. దాంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో పోలీసులు ముకుమ్మడి దాడులు నిర్వహించారు. 

Advertisement
 
Advertisement
Advertisement