ఏపీ ప్రభుత్వంపై మోదీ ప్రశంసలు

ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పశంసించారు. బుధవారం ప్రధాని సంప్రదాయేతర విద్యుత్ వివిధ రాష్ట్రాల మధ్య పంపిణీ వ్యవస్థ ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రధాని మాట్లాడుతూ.. ఏపీలోని వేమగిరి ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. దీంతో పాటు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి యువ అధికారులను నియమించాలని ఆయన ఆదేశించారు. ప్రగతి ప్రాజెక్టులో భాగంగా దేశంలో ముఖ్యమైన అభివృద్ధి పనులను ప్రధాని నేరుగా సమీక్షించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి