
పశ్చిమగోదావరి : కొండలరావుపాలెంకు చెందిన దేవళ్లరాజు రాజశేఖర్ చెక్కతో నాగలి తయారు చేయించి జగనన్నకు తోడుగా పాదయాత్ర వెంట నడుస్తున్నారు. పాదయాత్రకు ముందుగా ఆయన నడస్తూ, జగనన్న వస్తున్నాడంటూ దారి పొడవునా ప్రచారం చేస్తుండటం విశేషం. ఆయనకు తోడుగా ఆయన స్నేహితులు కూడా ఒకరు తర్వాత ఒకరు నాగలి ధరించి పాదయాత్రలో ముందుకు సాగారు.