
కృష్ణాజిల్లా : అయ్యా... మా గ్రామంలో మంచినీటి సమస్య, ఇళ్ల స్థలాల సమస్యలపై పలుమార్లు అధికారులను అడిగినా పట్టించుకోవడం లేదు’ అని చింతపాడు, దెయ్యంపాడు గ్రామాలకు చెందిన జయమంగళ వీర్రాజు, స్థానిక మహిళలు జననేత జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గ్రామానికి వచ్చిన జగన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. గ్రామంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, రోడ్లు పక్కన నివసించే వారికి ప్రభుత్వ ఇళ్లు కట్టించాలని ఎన్ని సార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని వాపోయారు.