మాకు పార్టీకన్నా ప్రజలే ముఖ్యం : కావూరి | People is important than Party to us: Kavuri Sambasiva Rao | Sakshi
Sakshi News home page

మాకు పార్టీకన్నా ప్రజలే ముఖ్యం:కావూరి

Sep 14 2013 2:53 PM | Updated on Aug 15 2018 7:45 PM

మాకు పార్టీకన్నా ప్రజలే ముఖ్యం : కావూరి - Sakshi

మాకు పార్టీకన్నా ప్రజలే ముఖ్యం : కావూరి

తమకు పార్టీకన్నా ప్రజలే ముఖ్యం అని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు.

హైదరాబాద్: తమకు పార్టీకన్నా ప్రజలే ముఖ్యం అని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. సీమాంధ్ర నేతల సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ ఒత్తిడి మేరకే కేంద్రం ఆంటోని కమిటీని నియమిచిందని చెప్పారు. సీమాంధ్రలో అన్ని వర్గాలు ఏకమై సమైక్య ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాయన్నారు. ఒక్క రాజకీయ నేత లేకుండా సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతోందని చెప్పారు.

 సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని ప్రత్యక్షంగా చూడాలని ఆంటోనీ కమిటీనీ కోరతామని చెప్పారు.  ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కమిటీకీ స్పష్టం చేస్తామన్నారు. సీమాంధ్రలో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు దృష్టిలో పెట్టుకుని త్వరలోనే హైకమాండ్‌ను కలుస్తామని చెప్పారు.

అనంతరం  కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పురందేశ్వరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement