చాలా చోట్ల అర్హులకు సామాజిక భద్రతా పింఛన్లు రద్దయిపోయాయన్న ఫిర్యాదులు వస్తున్నాయని, తమ పరిశీలనలో సైతం ఇది వాస్తవమని తేలిందని,
రాజాం: చాలా చోట్ల అర్హులకు సామాజిక భద్రతా పింఛన్లు రద్దయిపోయాయన్న ఫిర్యాదులు వస్తున్నాయని, తమ పరిశీలనలో సైతం ఇది వాస్తవమని తేలిందని, ఇలాంటి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీస్తామని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు వ్యాఖ్యానించారు. అవసరమైతే బాధితుల తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని భరోసా ఇచ్చారు. ఆయన సోమవారం రాజాం మండలం బొద్దాంలో పర్యటించినప్పుడు ఆ గ్రామానికి చెందిన కొందరు పింఛన్ల విషయంలో అర్హత ఉన్నా తమకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. నియోజకవర్గంలో గాని, ఇతర ప్రాంతాలలో గాని పర్యటించినప్పుడు వైఎస్సార్‌కాంగ్రెస్ అనుకూలురకు అర్హతలున్నా పింఛన్లు రద్దుచేయడం అధికార పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. తొలుత కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి అక్కడి నుంచి కూడా సరైన స్పందన లేకపోతే బాధితులకు న్యాయం చేసేందుకు ఎంతవరకైనా వెళ్తామని చెప్పారు.