స్విట్జర్లాండ్‌లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగును మోసం చేసిన బి.ఎస్.రావు గ్రూపు సంస్థలో పోలీసులు శనివారం తనిఖీలు చేశారు.
హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగును మోసం చేసిన బి.ఎస్.రావు గ్రూపు సంస్థలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పలు పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన దుర్గా పవన్‌కుమార్ రాజ్‌భవన రోడ్డులోని అమృతావిల్లా అపార్ట్‌మెంట్‌లో బి.ఎస్.రావు గ్రూప్ సంస్థను ఏర్పాటు చేసి, స్విట్జర్లాండ్‌లోని కొన్ని ఫార్మా సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసగించిన విషయం తెల్సిందే.
శుక్రవారం 95 మందిని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చి.. తీరా ముఖం చాటేసిన కేసులో నిందితుడు పవన్‌కుమార్, బ్రోకర్ యూసుఫ్‌లను అరెస్టు చేసి విచారిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా సంస్థ నుంచి కీలక పత్రాలు, పలు పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు.