అస్మ‘దేశీ’యుల కోసమే ఆలస్యం! | Part-time instructor in the art schools for recruitment | Sakshi
Sakshi News home page

అస్మ‘దేశీ’యుల కోసమే ఆలస్యం!

Jul 25 2014 1:59 AM | Updated on Sep 2 2017 10:49 AM

పాఠశాలల్లో పార్ట్ ఆర్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్ల నియామకాలకు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి మోకాలు అడ్డుపెట్టారా...? ఈ పోస్టులను ఎప్పటిలాగే భర్తీ చేసేందుకు అంతా సిద్ధమైన

విజయనగరం కంటోన్మెంట్: పాఠశాలల్లో పార్ట్ ఆర్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్ల నియామకాలకు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి మోకాలు అడ్డుపెట్టారా...? ఈ పోస్టులను ఎప్పటిలాగే భర్తీ చేసేందుకు అంతా సిద్ధమైన తరువాత నిలిపివేయడంలో ఆ నేత హస్తముందా? తమ వారిని నియమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? అంటే అవుననే ప్రచారం జోరుగా సాగుతోంది.
 
 ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో  విధులు నిర్వహిస్తున్న ఆర్‌వీఎం పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లను ఈ సంవత్సరం  నిలిపేశారు. ప్రతి ఏటా ఈ పోస్టుల ను రద్దు చేస్తూ,  మళ్లీవారినే కొనసాగించాలని ఆదేశి స్తూ అదే ఉత్తర్వుల్లో పేర్కొనడం సాధారణం. అయితే ఈ ఏడాది కేవలం రద్దు ఉత్తర్వులే అందాయి. కానీ వారిని నియమించే ఉత్తర్వులు మాత్రం రాలేదు. జిల్లాలో 204 మంది ఆర్వీఎం ఇన్‌స్ట్రక్టర్లున్నారు. వీరిని 2013 మార్చి 6న నియమించారు. ఈ ఏడాది వీరి నియామకంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. నెల రోజులుగా వీరు పోస్టుల కోసం తిరుగుతున్నారు.  ఇప్పటికే  కలెక్టర్‌ను పలుమార్లు కలిశారు. జిల్లాకు చెందిన ఓ ముఖ్యప్రజాప్రతినిధి నియామకాలను అడ్డుకున్నారని, ఆ మేరకు తమకు సమాచారం అందిందని కొంతమంది ఇన్‌స్ట్రక్టర్లు వాపోతున్నారు.
 
 గ్రీవెన్స్‌సెల్‌లో వినతి...
 ఇన్‌స్ట్రక్టర్లు సోమవారం గ్రీవెన్స్ సెల్‌లో వినతిపత్రం అందజేయడంతో కలెక్టర్ ఎంఎం నాయక్, జేసీ రామారావు, ఆర్వీఎం పీఓ శారదలను పిలిపించి వీరి సమస్య గూర్చి ప్రశ్నించారు. గత ఏడాది 204 పోస్టులుండేవని, ఇప్పుడు మొత్తం 283 పోస్టులు మంజూరయ్యాయనీ కొత్తగా నియామకాలు చేస్తున్నామనీ పీఓ శారద తెలి పారు. పాత వారి పరిస్థితి ఏమిటని కలెక్టరు ప్రశ్నించ గా.... సర్టిఫికెట్లు ఉన్నవారిని మాత్రమేపరిశీలిస్తున్నామని తెలిపారు. దీనిపై ఇన్‌స్ట్రక్టర్లు మాట్లాడుతూ అర్హతలున్నవారిని ముందుగా ఎంపికచేయాలని  కోరారు. ఈ అభ్యర్థనపై ఆమె మాట్లాడుతూ  జాబితా  తయారవుతోందని చెప్పారు. దీనిపై కలెక్టర్ నాయక్ కూడా మాట్లాడుతూ ప్రాజెక్టు అధికారులనుంచి ఏ నిబంధన లు వస్తే దానికి అనుగుణంగా పోస్టులు భర్తీ చేస్తామని  హామీ ఇచ్చారు.   
 
 ఇతర జిల్లాల్లో పోస్టుల కొనసాగింపు!
 ఇక్కడ నిలిపివేసినా... శ్రీకాకుళం తదితర జిల్లాల్లో మాత్రం యథావిధిగా పాతవారినే కొనసాగిస్తున్నారు. అర్హత ఉన్నవారితో పాటు రిలీవ్ అయిన వారు కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ పరిస్థితులు భిన్నంగా ఉండడంతో  తమకు పోస్టులు దక్కవేమోనని జిల్లా ఇన్‌స్ట్రక్టర్లు ఆందోళన చెందుతున్నారు.
 
 బెల్ కూడా కొట్టేవారం!
 తాము పాఠశాలల్లో పార్ట్‌టైంగా పనిచేస్తున్నా ఫుల్‌టైం సేవలందించేవారమని పలువురు ఇన్‌స్ట్రక్టర్లు తెలిపా రు.  ప్యూన్లు లేని పాఠశాలల్లో అన్ని పనులు తామే చేశామని, బెల్ కూడా తామే కొట్టేవార మని తెలిపారు. సెలవులు కూడా తమకు ఇవ్వరని, అసలు తమకు ఎన్ని సెలవులున్నాయన్న విషయాన్ని కూడా ఎప్పు డూ చెప్పలేదనీ తెలిపారు. ఉద్యోగాల నుంచి తొలగిస్తే భార్యాబిడ్డలతో ఇప్పుడు తామెటు పోవాలని వారు ఆందోళన చెందుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement