దేవినేని ఉమ పెద్ద బ్రోకర్‌: పార్ధసారథి | Pardasaradi fires on Minister Devineni Uma | Sakshi
Sakshi News home page

దేవినేని ఉమ పెద్ద బ్రోకర్‌: పార్ధసారథి

Oct 25 2017 8:31 PM | Updated on Oct 25 2017 8:43 PM

Pardasaradi fires on Minister Devineni Uma

సాక్షి, కృష్ణా జిల్లా: పేపర్ మిల్లులతో మంత్రి దేవినేని ఉమ కుదుర్చుకున్న చీకటి ఒప్పందాల వల్లే గిట్టుబాటు ధర రావడం లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్ధసారథి విమర్శించారు. రైతుల పక్షాన నిలబడి పేపర్ మిల్లు యాజమాన్యాలను దేవినేని ఉమ ఎందుకు ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. మంత్రి దేవినేని ఉమ పెద్ద బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నాడని నిప్పులు చెరిగారు.

సీఎం చంద్రబాబునాయుడుకు కాంట్రాక్టర్కు మధ్య దేవినేని బ్రోకర్లా వ్యవహరిస్తున్నారని పార్థసారథి ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలని బ్రోకర్లను చేసి, రైతులను దోపిడీ చేయించేందుకే 498 జీఓ జారీ చేయించారని మండిపడ్డారు. దుర్భుద్దితోనే మంత్రి దేవినేని ఉమ రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆరోపించారు.  అలాగే పత్తి రైతులు కూడా కనీస ధరలకు దూరమయ్యారని అన్నారు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఎందుకు సీసీఐతో పత్తి కొనుగోళ్లు చేయించడం లేదని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement