పరిమళించిన మానవత్వం

Orphan Old Women Funeral Programme in Srikakulam - Sakshi

అనాథ వృద్ధురాలికి అంత్యక్రియలు

శ్రీకాకుళం, కొత్తూరు: కన్నవారినే కనికరం లేకుండా రోడ్డున పడేస్తున్న ఈ రోజుల్లో ఊరికాని ఊరు వచ్చిన ఓ అనాథ వృద్ధురాలిని సాకడమే కాదు, అంతిమ దహన సంస్కారాలు కూడా చేసిన పాడలి నిర్వాసితులు తమ మానవత్వం చాటుకున్నారు. పదేళ్ల క్రితం హిరమండలం మండలం పరిధి పాడలి నిర్వాసిత గ్రామానికి ఒడిశా నుంచి ఓ వృద్ధురాలు (70) వచ్చింది. అప్పట్నుంచి నిర్వాసిత గ్రామంలోనే ఉండిపోయింది. ఈమెకు తెలుగు రాకపోవడంతో ముసలమ్మ, బుడి అని పిలిచుకునేవారు. గ్రామస్తులు రోజూ భోజనం పెడుతూ ఆదరించేవారు. ఆ తర్వాత తమతోపాటు మెట్టూరు బిట్‌–2 పునరావాస కాలనీకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో మతిస్థిమితం లేకపోవడంతో రోడ్లుపై తిరుగుతూ అనారోగ్యం పాలైంది. చివరకు బుధవారం మృతి చెందగా నిర్వాసితులైన ప్రశాంత్, పీ రమేష్, పెద్దకోట శ్రీనివాసరావు, ఆదినారాయణ, కాంతారావు, వైకుంఠరావు, తదితరులు దహన సంస్కారాలు చేశారు. కాలనీకి చెందిన పొడ్డిన ఉమ తలకొరివి పెట్టారు. అదేవిధంగా కర్మకాండలు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top