ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను ఈనెల 16 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ వెంకటేశ్వర శర్మ శుక్రవారం తెలిపారు.
పరీక్ష మొదలైన పావుగంట వరకే హాలులోకి అనుమతి
హైదరాబాద్: ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను ఈనెల 16 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ వెంకటేశ్వర శర్మ శుక్రవారం తెలిపారు. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, మధాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
పదో తరగతి పరీక్షలు రాసే 90,607 మంది విద్యార్థులకు 342 కేంద్రాలు, ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే 1,09,469 మంది విద్యార్థులకు 359 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. హాల్‌టికెట్లను సంబంధిత స్టడీ సెంటర్‌లో పొందవచ్చని, తమ వెబ్‌సైట్ నుంచి (ఠీఠీఠీ.్చఞౌఞ్ఛటఛిజిౌౌ.ౌటజ) కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. విద్యార్థులను పరీక్ష మొదలైన 15 నిమిషాల వరకే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారని తెలిపారు.