బద్దలైన ఓఎన్‌జీసీ పైపులైన్ | ongc gas line dameged in east godavari | Sakshi
Sakshi News home page

బద్దలైన ఓఎన్‌జీసీ పైపులైన్

Apr 7 2015 8:51 PM | Updated on Sep 2 2017 11:59 PM

బద్దలైన ఓఎన్‌జీసీ పైపులైన్

బద్దలైన ఓఎన్‌జీసీ పైపులైన్

తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని ఓఎన్‌జీసీకి చెందిన మోరి గ్యాస్ కలెక్షన్ స్టేషన్ (జీసీఎస్) ఆవరణలో మంగళవారం ఉదయం ముడి చమురును చేరవేసే పైపులైను అకస్మాత్తుగా బద్దలైంది.

సఖినేటిపల్లి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని ఓఎన్‌జీసీకి చెందిన మోరి గ్యాస్ కలెక్షన్ స్టేషన్ (జీసీఎస్) ఆవరణలో మంగళవారం ఉదయం ముడి చమురును చేరవేసే పైపులైను అకస్మాత్తుగా బద్దలైంది. దీంతో సుమారు 20 అడుగుల ఎత్తున ఉన్న రక్షణ గోడపై నుంచి 10 మీటర్ల దూరం వరకూ కొబ్బరి చెట్ల పై నుంచి చమురు వర్షంలా ఎగజిమ్మింది. కొబ్బరి చెట్ల ఆకులన్నీ ఆయిల్‌తో తడిసిపోయాయి. కొబ్బరి తోటల మధ్య ఉన్న రొయ్యల చెరువులు, చేపల చెరువులు, పంట బోదెల్లో కూడా ఆయిల్ తెట్టు మాదిరిగా కమ్మేసింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న సిబ్బంది వెంటనే స్పందించారు. వాల్వు క్లోజ్ చేసి, ఆయిల్ సరఫరాను నిలిపివేశారు. బద్దలైన పైపును మార్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement