పొలం పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్తు తీగలు తగిలి బుధవారం రాత్రి నారపురెడ్డి శరత్ కుమార్ రెడ్డి(22) అనే వ్యక్తి మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
వైఎస్సార్ జిల్లా(రాజంపేట): పొలం పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్తు తీగలు తగిలి బుధవారం రాత్రి నారపురెడ్డి శరత్ కుమార్ రెడ్డి(22) అనే వ్యక్తి మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా రాజంపేటలోని ఎస్‌ఆర్‌పాలెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో బి.గోపాల్ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.