ఆటో, స్కూటర్ ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు.
వైఎస్సార్ జిల్లా (జమ్మలమడుగు) : ఆటో, స్కూటర్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం వైఎస్సార్ జిల్లా జమ్మల మడుగులో చోటుచేసుకుంది. జిల్లాలోని ముద్దునూరు మండలానికి చెందిన నాసిర్(21) తన స్నేహితులతో కలసి స్కూటర్ పై వెళ్తూ.. జమ్మలమడుగు మండలం చిలిమిడి వద్ద ఆటోను ఢీకొట్టాడు.
దీంతో తీవ్ర గాయాలైన నాసిర్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని స్థానికులు 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.