అమ్మో బొమ్మ..! | Nutritional supplements for health centers Dolls not Buying | Sakshi
Sakshi News home page

అమ్మో బొమ్మ..!

Mar 4 2015 1:54 AM | Updated on Sep 2 2017 10:14 PM

ఐటీడీఏ పరిధిలో గల ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆరోగ్య పౌష్టికాహార కేంద్రాల కోసం కొనుగోలు చేసిన బొమ్మలకు సంబంధించిన

పార్వతీపురం:ఐటీడీఏ పరిధిలో గల ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆరోగ్య పౌష్టికాహార కేంద్రాల కోసం కొనుగోలు చేసిన బొమ్మలకు సంబంధించిన ఫైల్స్ వెదుకు లాటలో అధికారులకు చెమటలు పడుతున్నట్లు సమాచారం. మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘వినండి బొమ్మల గోల...కనండి ఐకేపీ లీల’ అంటూ ప్రచురితమైన కథనం పట్ల స్థానిక ఐకేపీ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతూ బొమ్మల కొనుగోలు ఫైల్ కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిసింది. రూ.36లక్షలకు సంబంధించి బొమ్మల కొనుగోలులో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది మధ్య పంపకాల ఒప్పందాలు కుదరక పోవడంతో, అందులో ఓ అధికారి  బొమ్మల కొనుగోలులో ఆరోపణలను జత చేస్తూ...గత పీఓ ద్వారా సెర్ఫ్‌కు లెటర్ రాయించినట్లు సమాచారం.
 
 ఆ లెటర్‌కు స్పందించిన సెర్ఫ్ నుంచి పూర్తి డాక్యుమెంట్లు సమర్పించాలని గత ఏడాది జనవరి 27వ తేదీన ఆదేశాలు వచ్చాయి. అయితే పంపకాల ఒప్పందం కుదుర్చుకున్న  అధికారులు, సెర్ఫ్ నుంచి వచ్చిన లెటర్‌ను ఐటీడీఏ పీఓ దృష్టికి తీసుకెళ్లలేదని సమాచారం. జనవరి నుంచి ఇప్పటి వరకు కనీసం సెర్ఫ్ ఆదేశాల పట్ల స్పందించకపోగా, అప్పటి పీఓ రజత్ కుమార్ సైనీ, ప్రస్తుత శ్రీకేశ్ బి లఠ్కర్‌ల దృష్టికి తీసుకెళ్లకపోవడమే అధికారుల అవినీతి ఆరోపణలకు ఊతమిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన పీఓ శ్రీకేశ్ బి లఠ్కర్‌ను ఈ బొమ్మల కొనుగోలు విషయమై ఒప్పించేందుకు అధికారులు నానా తంటా లు పడుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఐకేపీలో జరుగుతున్న పలు రకాల అవినీతికి గత కొన్ని సంవత్సరాలుగా ఆ శాఖలో ఫైనాన్స్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కేంద్ర బిందువనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా పీఓ శ్రీకేశ్ బి లఠ్కర్ దీనిపై దృష్టి సారిస్తారని గిరిజనులు, గిరిజన సంఘ నాయకులు ఆశిస్తున్నారు.
 
 ‘విదుర నీతులు’ పుస్తకావిష్కరణ
 విజయనగరం మున్సిపాలిటీ : రామాయణ, మహాభారతాలు దేశ ఔన్నత్యానికి ప్రతీకలు అని ప్రముఖ అధ్యాత్మిక వేత్త, విశాఖ జిల్లా నర్సీపట్నానికి  చెందిన శివబాబా అన్నారు. తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఆఫీసర్స్ క్లబ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు అయిన భారతదేశంలో జన్మించడమే పూర్వజన్మ సుకృత   మన్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని, పెద్దల్లో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు సాగి సీతారామరాజు స్మారక కళాపీఠం ప్రచురిం చిన విదుర నీతులు పుస్తకాన్ని ఆవిష్కరించా రు. కళాపీఠం అధ్యక్షుడు రాజు, తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు గురుప్రసాద్, శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement