ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన ఏపీ బడ్జెట్లో ఆర్థిక నిర్వహణ చాలా బాగుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన ఏపీ బడ్జెట్లో ఆర్థిక నిర్వహణ చాలా బాగుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలపై పన్నుల భారం మోపకుండానే బైరటీస్, ఇసుక, ఎర్రచందనం, ఇతర ఖనిజాల ద్వారా తమ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటామని చెప్పారు.
సాగునీటి రంగానికి కేటాయింపులు అధికంగా చేశామని పరకాల తెలిపారు. రాజధానికి భూములిచ్చిన రైతుల పరిహారం చెల్లింపునకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పరకాల ప్రభాకర్ చెప్పారు.