'బ్లాక్ మెయిల్ చేస్తున్నారు..భయపడేది లేదు' | no need to afraid of blackmails, says chandra babu | Sakshi
Sakshi News home page

'బ్లాక్ మెయిల్ చేస్తున్నారు..భయపడేది లేదు'

Jun 5 2015 4:53 PM | Updated on Jul 28 2018 6:35 PM

'బ్లాక్ మెయిల్ చేస్తున్నారు..భయపడేది లేదు' - Sakshi

'బ్లాక్ మెయిల్ చేస్తున్నారు..భయపడేది లేదు'

ప్రకాశం జిల్లా సీఎస్ పురం మండలం శీలంవారిపల్లిలో జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.

నెల్లూరు/ప్రకాశం : ప్రకాశం జిల్లా సీఎస్ పురం మండలం శీలంవారిపల్లిలో జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. గ్రామంలో పనులేమీ జరగలేదని సీఎంకు గ్రామస్తులు ఫిర్యాదుచేశారు. అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని సీఎం హెచ్చరించారు. కేసులు పెడతామంటూ కొంతమంది బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. అయినా భయపడేది లేదని సీఎం చంద్రబాబు అన్నారు.

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు చేపట్టిన జన్మభూమి సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈదురుగాలులు వీచడంతో కార్యక్రమానికి ఏర్పాటుచేసిన టెంట్లు కూలిపోయాయి. దీంతో అక్కడే విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. సీఎం చంద్రబాబు కాన్వాయ్ అడ్డుకున్న ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. లాఠీఛార్జ్ చిత్రీకరించిన మీడియాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మీడియా నుంచి పోలీసులు కెమెరాలు లాక్కుని విజువల్స్ తొలగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement