జగన్ శ్రీవారి దర్శనంలో వివాదం లేదు: ఈవో | no controversy in ys jagan mohan reddy tirumala visit | Sakshi
Sakshi News home page

జగన్ శ్రీవారి దర్శనంలో వివాదం లేదు: ఈవో

Mar 7 2014 10:48 AM | Updated on Aug 28 2018 5:48 PM

జగన్ శ్రీవారి దర్శనంలో వివాదం లేదు: ఈవో - Sakshi

జగన్ శ్రీవారి దర్శనంలో వివాదం లేదు: ఈవో

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడంతో ఎలాంటి వివాదం లేదని టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ స్పష్టం చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడంతో ఎలాంటి వివాదం లేదని టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ హిందూ సంప్రదాయబద్ధంగానే స్వామివారిని దర్శించుకున్నారని ఆయన తెలిపారు. ఈ విషయంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని టీటీడీ ఈవో గోపాల్‌ మండిపడ్డారు.

ఒకవర్గం మీడియాలో వైఎస్ జగన్ శ్రీవారి దర్శనంపై విపరీతంగా ప్రచారం జరగడం, ఆ వివాదం ఏంటో వివరాలు పంపాలని గవర్నర్ నరసింహన్ కూడా టీటీడీ అధికారులను కోరడం లాంటి విషయాలు తెలిసిందే. ఇప్పుడు స్వయంగా టీటీడీ ఈవోనే విషయం బయటపెట్టడంతో వివాదానికి తెర పడినట్లయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement