గత రెండు రోజుల్లో ఒక్కటైన నూతన వధూవరులతోపాటు దుర్గమ్మ సన్నిధిలో పెళ్లి చేసుకునేందుకు వచ్చినవారితో ఆదివారం ఇంద్రకీలాద్రిపై సందడి వాతావరణం నెలకొంది.
గత రెండు రోజుల్లో ఒక్కటైన నూతన వధూవరులతోపాటు దుర్గమ్మ సన్నిధిలో పెళ్లి చేసుకునేందుకు వచ్చినవారితో ఆదివారం ఇంద్రకీలాద్రిపై సందడి వాతావరణం నెలకొంది. ఆలయ ప్రాంగణంలోని షెడ్డుతో పాటు ఉపాలయాల వద్ద పెద్ద సంఖ్యలో వివాహాలు
జరిగాయి. నూతన వధూవరులతో పాటు సాధారణ భక్తులు కూడా భారీగా రావడం తో ఆదివారం తెల్లవారుజాము నుంచే రద్దీ
నెలకొంది.
ఉదయం నుంచి రాత్రి వరకు 50వేల మందికి పైగా అమ్మవారిని దర్శించుకుని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
సర్వ దర్శనం క్యూలైనైఉలో అమ్మవారి దర్శనా నికి మూడు గంటల సమయం పట్టింది. శీ్రౌు్ఛ దర్శనం క్యూలైనైఉ షాపింగ్ కాంెౌ్ఛ్లక్స్ దాటింది. మహానివేదన, సాయంత్రం పంచహారతుల సమయంలో రద్దీ మరింతగా నెలకొంది.
భక్తుల వాహనాలు నిలపడంతో ౌూ్ఛటైఉరోడ్డుపై రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. ఉదయం 11 గంటల నుంచే కొండపైకి ద్విచక్రవా
హనాలు మినహా ఇతర వాహనాలను అను మతించలేదు. కార్లు, వ్యాన్లు, ఇతర వాహనాలను కనక దుర్గనగర్‌లో నిలుపుకోవాలని దేవస్థాన సిబ్బంది సూచిస్తుండగా, అక్కడా ఖాళీ లేకపోవ డంతో భక్తులు తమ వాహనాలను అర్జున వీధిలో నిలుపోవాల్సి వచ్చింది.