300 కిలోల ‘బుల్‌ షార్క్‌’

Nellore Fishermen Catch 300 KGs Bull shark - Sakshi

సాక్షి, విడవలూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పెదపాళెం పంచాయతీ పరిధిలోని వెంకటరెడ్డిపాళెంకు చెందిన మత్స్యకారుల వలకు బుధవారం 300 కేజీల భారీ బుల్‌ షార్క్‌ (సొర చేప) చిక్కింది. మత్స్యకారులు చుక్కా సుబ్రమణ్యం, ఎందేటి బ్రహ్మయ్య, పుల్లయ్య వెంకటరెడ్డిపాళెం సమీపంలోని సముద్రంలోకి వలను విసిరారు. భారీ బుల్‌ షార్క్‌ వలకు చిక్కడంతో దానిని బయటకు తీసేందుకు కష్టంగా మారింది. దీంతో స్థానికులతోపాటు 20 మంది మత్స్యకారులు ఆ చేపను బోటులో వెంకటరెడ్డిపాళెంకు తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న చెన్నై వ్యాపారస్తులు వచ్చి కేజీ రూ.150 చొప్పున రూ.45 వేలకు దానిని కొనుగోలు చేశారు. తామెప్పుడూ ఇంత పెద్ద చేపను చూడలేదని మత్స్యకారులే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారీ ‘బుల్‌ షార్క్‌’ను చూసేందుకు స్థానికులు అమితాస​క్తి చూపారు. (చదవండి: ఆ ఎమ్మెల్సీతో మాట్లాడితే రూ.10వేల జరిమానా)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top