ప్రేమ హత్యలే అధికం! 

NCRB reports that love affairs is the reason for majority of murders in the country - Sakshi

టాప్‌లో ఏపీ.. రెండో స్థానంలో ఢిల్లీ 

ఎన్‌సీఆర్‌బీ నివేదికలో వెల్లడి

సాక్షి, అమరావతి: దేశంలో అధిక శాతం హత్యలకు ప్రేమ వ్యవహారాలే కారణమవుతున్నాయని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. ఎన్‌సీఆర్‌బీ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో 28% హత్యలు ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాల వల్లే జరుగుతున్నాయి. 2001-2017 మధ్య కాలంలో జరిగిన హత్యలకు మూడో అతిపెద్ద కారణం ప్రేమ వ్యవహారాలే.

ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్రల్లో జరిగిన హత్యల్లో అత్యధిక శాతం ప్రేమ వ్యవహారాలవే ఉన్నాయి. ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రెండో స్థానంలో ప్రేమ హత్యలున్నాయి. 2001లో దేశవ్యాప్తంగా 36,202 హత్య కేసులు నమోదుకాగా, 2017లో 21% తగ్గి 28,653 కేసులు నమోదయ్యాయి. వ్యక్తిగత కక్షతో చేసే హత్యలు 4.3% తగ్గగా, ఆస్తి వివాదాల వల్ల జరిగే హత్యలు 12% తగ్గాయి. 2016లో 71 పరువు హత్య కేసులు నమోదు కాగా, 2017లో 92 కేసులు నమోదయ్యాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top