
సరుబుజ్జిలి: మండలంలోని వెన్నెవలస గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో శనివారం నాగుపాము కలకలం సృష్టించింది. తరగతి గదుల్లోకి రావడంతో విద్యార్థులు, సిబ్బంది ¿భయాందోళనకు గురయ్యారు. గదుల్లోకి పాము వెళ్లడంతో బాలికలు ఉరుకులు పరుగులు తీశారు. వెంటనే వార్డెన్ వాసుదేవరావు స్పందించి పామును పట్టుకుని హతమార్చారు. పక్కనే ఆటవిక ప్రాంతం ఉండడంతో తరుచూ విష జంతువుల తాకిడి అధికంగా ఉందని సిబ్బంది వాపోతున్నారు.