సూర్యకుమారి మిస్టరీ విషాదాంతం | mystery end with tragedy.. suryakumari dead | Sakshi
Sakshi News home page

సూర్యకుమారి మిస్టరీ విషాదాంతం

Aug 5 2017 8:12 PM | Updated on Sep 17 2017 5:12 PM

సూర్యకుమారి మిస్టరీ విషాదాంతం

సూర్యకుమారి మిస్టరీ విషాదాంతం

విజయవాడలో సంచలనం సృష్టించి మిస్టరీగా మారిన డాక్టర్‌ కొర్లపాటి సూర్య కుమారి అదృశ్యం కేసు విషాదంగా ముగిసింది. రైవస్‌ కాలువలో ఆమె మృతదేహం లభ్యమైంది.

విజయవాడ: విజయవాడలో సంచలనం సృష్టించి మిస్టరీగా మారిన డాక్టర్‌ కొర్లపాటి సూర్య కుమారి అదృశ్యం కేసు విషాదంగా ముగిసింది. రైవస్‌ కాలువలో ఆమె మృతదేహం లభ్యమైంది. విస్తృత గాలింపుల అనంతరం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఆమె మృతదేహం వెలికితీశాయి. గత నాలుగు రోజులుగా కనిపించకుండాపోయిన సూర్యకుమారి కేసులో శనివారమే పోలీసులకు ఆధారం దొరికింది. ఆమె నడిపే బైక్‌ రైవస్‌ కాల్వ వద్ద లభించింది. దీంతో సూర్యకుమారి కాలువలో దూకి ఉంటుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

ఇందులో భాగంగా ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను ప్రత్యేకంగా రంగంలోకి దింపారు. ఆమె నడిపే మోపెడ్‌ బైక్‌ లభించిన కాల్వలో గాలింపు చర్యలు ప్రారంభించారు. కాల్వమొత్తం ప్రత్యేక బోటులతో గాలించడంతో ఓ రైల్వేగేటుకు సమీపంలోని రైవస్‌ కాలువలో ముళ్ల కంపలోచిక్కుకొని ఉన్న ఆమె మృతదేహం గుర్తించి వెలికి తీశారు. నాలుగు రోజులు కావడంతో ఆమె మృతదేహం దాదాపు కుళ్లిన స్థితిలోకి వచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement