బెల్టుషాపుల రద్దుపైనే రెండో సంతకం :చంద్రబాబు | my second sign on wine shop cancellation : chandra babu | Sakshi
Sakshi News home page

బెల్టుషాపుల రద్దుపైనే రెండో సంతకం :చంద్రబాబు

Jan 6 2014 1:09 AM | Updated on Jul 28 2018 6:33 PM

బెల్టుషాపుల రద్దుపైనే రెండో సంతకం :చంద్రబాబు - Sakshi

బెల్టుషాపుల రద్దుపైనే రెండో సంతకం :చంద్రబాబు

తనను తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే రాష్ట్రంలో బెల్టుషాపులను రద్దు చేయడంపైనే రెండో సంతకం పెడతానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మహిళలకు హామీ ఇచ్చారు.

 మహిళలకు బాబు ‘హామీల బహిరంగ లేఖ’
 సాక్షి, హైదరాబాద్: తనను తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే రాష్ట్రంలో బెల్టుషాపులను రద్దు చేయడంపైనే రెండో సంతకం పెడతానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మహిళలకు హామీ ఇచ్చారు. ఈ మేరకు మహిళలకు బహిరంగ లేఖ పేరుతో ఏడు పేజీల పత్రికా ప్రకటనను ఆయన ఆదివారం విడుదల చేశారు. ఇందులో పలు హామీలను గుప్పించారు. తన చివరి రక్తపుబొట్టు వరకు మహిళాభ్యుదయం కోసమే కృషి చేస్తాన ని పేర్కొన్నారు. ‘నాకు అండగా ఉండండి. మీకు అన్నగా ఉంటా’ అని లేఖలో తెలిపారు. అధికారంలోకి రాగానే డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాన్ని మాఫీ చేస్తానని, మహిళా సంఘాలకు అదనపు రుణాలను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement