breaking news
wine shop cancellation
-
చంద్రబాబుపై శృంగవరపుకోట పబ్లిక్ ఫైర్
-
వైన్ షాప్ వద్దంటూ పబ్లిక్ నిరసన
-
బెల్టుషాపుల రద్దుపైనే రెండో సంతకం :చంద్రబాబు
మహిళలకు బాబు ‘హామీల బహిరంగ లేఖ’ సాక్షి, హైదరాబాద్: తనను తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే రాష్ట్రంలో బెల్టుషాపులను రద్దు చేయడంపైనే రెండో సంతకం పెడతానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మహిళలకు హామీ ఇచ్చారు. ఈ మేరకు మహిళలకు బహిరంగ లేఖ పేరుతో ఏడు పేజీల పత్రికా ప్రకటనను ఆయన ఆదివారం విడుదల చేశారు. ఇందులో పలు హామీలను గుప్పించారు. తన చివరి రక్తపుబొట్టు వరకు మహిళాభ్యుదయం కోసమే కృషి చేస్తాన ని పేర్కొన్నారు. ‘నాకు అండగా ఉండండి. మీకు అన్నగా ఉంటా’ అని లేఖలో తెలిపారు. అధికారంలోకి రాగానే డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాన్ని మాఫీ చేస్తానని, మహిళా సంఘాలకు అదనపు రుణాలను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.