'అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోండి' | MVS Nagi Reddy Condemn YSRCP Leader Murder | Sakshi
Sakshi News home page

'అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోండి'

Aug 11 2014 2:52 PM | Updated on May 29 2018 2:48 PM

'అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోండి' - Sakshi

'అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోండి'

గొట్టిముక్కల గ్రామ ఉప సర్పంచ్ హత్యను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి తీవ్రంగా ఖండించారు.

హైదరాబాద్: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టిముక్కల గ్రామ ఉప సర్పంచ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కృష్ణారావు దారుణహత్యను  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి  తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేతలు హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు. అధికారం శాశ్వతం కాదని టీడీపీ నేతలు గుర్తించుకోవాలని సూచించారు. గొట్టిముక్కల గ్రామ ఉప సర్పంచ్ కృష్ణారావును ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. టీడీపీకి చెందినవారే ఈ హత్య చేశారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement