మాదిగలను నమ్మించి మోసం చేసిన చంద్రబాబు తగిన మూల్యం చెల్లించక తప్పదని ఎమ్మార్పీఎస్ నేతలు హెచ్చరించారు.
మదనపల్లె(చిత్తూరు): మాదిగలను నమ్మించి మోసం చేసిన చంద్రబాబు తగిన మూల్యం చెల్లించక తప్పదని ఎమ్మార్పీఎస్ నేతలు హెచ్చరించారు. మంగళవారం చంద్రబాబు పర్యటను అడ్డుకోవాలని ఎమ్మార్పీఎస్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి నుంచే దాడులు చేసి పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. నిర్బంధంలోని ఎమ్మార్పీఎస్ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అద్యక్షులు నరేంద్ర, పట్టణాధ్యక్షులు వాసులు మాట్లాడుతూ దళిత ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు వర్గీకరణ విషయంలో మాదిగలను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. భవిష్యత్‌లో మాదిగల తడఖా ఏంటో చంద్రబాబుకు చూపిస్తామని హెచ్చరించారు. పోలీసుల అదుపులో ఎమ్మార్పీఎస్ చంద్ర, సుధాకర్, అనిల్, కిరణ్, లక్ష్మీనారాయణలు ఉన్నారు.