క్షతగాత్రుడికి ఎంపీ సురేష్‌ చేయూత | MP Nandigam Suresh Help to Casualties in Prakasam | Sakshi
Sakshi News home page

క్షతగాత్రుడికి ఎంపీ సురేష్‌ చేయూత

Nov 5 2019 1:13 PM | Updated on Nov 5 2019 1:13 PM

MP Nandigam Suresh Help to Casualties in Prakasam - Sakshi

క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలిస్తున్న ఎంపీ నందిగం సురేష్‌

ప్రకాశం ,సంతమాగులూరు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ చేయూతనందించి మానవత్వం చాటుకున్నారు. వివరాలు.. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ సోమవారం గుంటూరులో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఉన్నారు. గుంటూరు జిల్లా లాం ఫాం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పుడే అటు వైపుగా వచ్చిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ తన కారు ఆపి క్షతగాత్రుడి వద్దకు వెళ్లి స్వయంగా సపర్యలు చేశారు. అంతేగాకుండా క్షతగాత్రుడిని స్వయంగా మోసి 108లో ఎక్కించి ఆస్పత్రికి తీసుకెళ్లే వరకూ అక్కడే ఉండి మానవత్వం చాటుకుని స్థానికుల మన్ననలు అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement