చంద్రబాబు వాడుకుని వదిలేసే రకం | MP JC Diwakarreddy comments on CM Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వాడుకుని వదిలేసే రకం

May 8 2017 2:10 AM | Updated on Aug 16 2018 5:07 PM

చంద్రబాబు వాడుకుని వదిలేసే రకం - Sakshi

చంద్రబాబు వాడుకుని వదిలేసే రకం

ముఖ్యమంత్రి చంద్రబాబు కూరల్లో కరివేపాకులా వ్యక్తులను అవసరమైనపుడు మాత్రమే వాడుకుని వదిలేసే రకమని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

సీఎంపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్య

రాయదుర్గం: ముఖ్యమంత్రి చంద్రబాబు కూరల్లో కరివేపాకులా వ్యక్తులను అవసరమైనపుడు మాత్రమే వాడుకుని వదిలేసే రకమని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ అప్రదిష్టను తొలగించుకోవడానికే తన అల్లుడు దీపక్‌రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారన్నారు. దీపక్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారి రాయదుర్గం నియోజకవర్గ కేంద్రానికి వచ్చిన సందర్భంగా ఆదివారం ఆయనకు సన్మాన సభ ఏర్పాటు చేశారు.

ఈ సభలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. బాబుకు ఉన్నంత ఆశ దేశంలో ఏ ఒక్కరికీ లేదన్నారు. జిల్లాకు సాగునీరు ఇచ్చేలా ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాలని కోరారు. రాజకీయాల్లో డబ్బుకే ప్రాధాన్యత ఉందన్నారు. ప్రజల జేబుల్లో చేతులు పెట్టకూడదని, అలా అలవాటు చేసుకుంటే వారి రాజకీయ జీవితం ముగిసినట్టేనని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement