
తిరుపతి ఈద్గా సమస్యపై జగన్‌తో చర్చించిన ఎంపీ
తిరుపతిలో ఈద్గా సమస్యపై ఎంపీ వరప్రసాద్ శనివారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో చర్చించారు.
తిరుపతి మంగళం : తిరుపతిలో ఈద్గా సమస్యపై ఎంపీ వరప్రసాద్ శనివారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో చర్చించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఎంపీ వరప్రసాద్ తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. తిరుపతిలో ముప్పై సంవత్సరాలుగా ముస్లిం లు ప్రార్థనలు చేసుకుంటున్న ఈద్గా మైదానం తమది అని రైల్వే అధికారులు చెబుతున్నారనీ, అయితే ఇన్ని సంవత్సరాలు తమ ఆధీనంలో ఉన్న మైదనానాన్ని తమకు కేటాయించాలని ముస్లింలు కోరుతున్నారని చెప్పారు. గతంలో ముస్లిం మైనారిటీ నాయకులతో కలసి రైల్వే ఉన్నతాధికారులకు కూడా విన్నవించామని వివరించారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని జగన్‌మోహన్ రెడ్డి ఎంపీకి హామీ ఇచ్చారు.