అమ్మా.. నను చూడకుండానే కనుమూశావా..

Mother Death After Delivery In YSR Kadapa - Sakshi

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. నిండుచూలాలు మృతి

ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యుల నిరసన, ఆగ్రహం

అమ్మా.. నవమాసాలునను కంటికి రెప్పలాకాపాడుకున్నావు.. ననుఈ ప్రపంచానికి పరిచయంచేశావు... నీవు మాత్రంనాతో బంధాన్ని తెంపుకొన్నావు... నను చూడకుండానే కనుమూశావాతల్లీ.. నేనేపాపం చేశానని..వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో నీ ఆలన, పాలన,అనురాగం, ప్రేమకుదూరం అయ్యానా...!వైద్యుల నిర్లక్ష్యంతోనిండుచూలాలుమృతిచెందిన ఘటనగాలివీడు మండలంసీసీపల్లె గ్రామం కడపవాండ్లపల్లె దళితవాడలోశుక్రవారం చోటుచేసుకుంది.

వైఎస్‌ఆర్‌ జిల్లా , గాలివీడు : మండల పరిధిలోని సీసీపల్లె గ్రామం కడపవాండ్లపల్లె హరిజవాడకు చెందిన బాలిపోగు రామకృష్ణ భార్య చంద్రకళ(29) సరైన వైద్యం అందక మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి... చంద్రకళ గర్భందాల్చినప్పటి నుంచి నూలివీడు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో సూచనలు, సలహాలు తీసుకుంటోంది. ఆరు మాసాలు గడిచిన తరువాత రక్త హీనతతో ఉన్న విషయం వైద్యులకు తెలిసినప్పటికి మృతురాలికి రక్తం పెంచేందుకు చర్యలు తీసుకోలేదు. కాగా శుక్రవారానికి చంద్రకళకు తొమ్మిది నెలలు పూర్తవ్వడంతో పురిటి నొప్పులతో బాధపడుతుండా మధ్యాహ్నం ఆటో సహాయంతో నూలివీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేక పోవడంతో సిబ్బందితో వైద్యం అందిస్తున్న క్రమంలో చంద్రకళ ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రెండవ బిడ్డ జన్మించే సమయంలో వైద్యం వికటించి మృతి చెందింది. కాగా సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చంద్రకళ మృతిచెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతదేహాన్ని ఆసుపత్రి ఎదుట ఉంచి నిరసన వ్యక్తం చేశారు. ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఇకనైనా ఇలాంటి అత్యవసర కేసుల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించకుండా జిల్లాస్థాయి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు, ప్రజలు కోరుతున్నారు.

మృతురాలి కుటుంబాన్ని ఆదుకుంటాం : ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
 చంద్రకళ వైద్యం వికటించి మృతి చెందడం దురదృష్టకరమని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సానుభూతి వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని ఆయన కోరారు. చంద్రకళ మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ఆయనతోపాటు మాజీ జెడ్పీటీసీ జల్లా సుదర్శన్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు యదుభూషణ్‌రెడ్డి, గ్రామ నాయకులు కృష్ణారెడ్డిలు మృతదేహానికి సంతాపం తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top