కోడిపందాలు సంప్రదాయ క్రీడల్లో భాగం:తలసాని | Minister Talasani Srinivas Comments on Kodipandalu | Sakshi
Sakshi News home page

కోడిపందాలు సంప్రదాయ క్రీడల్లో భాగం:తలసాని

Jan 15 2020 1:09 PM | Updated on Jan 16 2020 12:03 PM

Minister Talasani Srinivas Comments on Kodipandalu - Sakshi

సాక్షి, ఉండి: సంక్రాంతి వేడుకల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం సీసలలో ఏర్పాటుచేసిన కోడిపందాలను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడి పందాలు సంప్రదాయ క్రీడల్లో ఒక భాగమని అన్నారు. గోదావరి జిల్లాలు సంక్రాంతి వేడుకలకు పెట్టింది పేరు అని కొనియాడారు. కోడిపందాలు ఆనవాయితీగా వస్తున్నాయని, వీటిని జూదంగా చూడొద్దని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంచి పథకాలు అమలు చేస్తున్నారని, సీఎం జగన్‌ అమలు చేస్తున్న అమ్మఒడి ఎంతో మంచి పథకమని ప్రశంసించారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement