ఆ వ్యాఖ్యలు బాధ కలిగించాయి: విజయ్‌ | minister ayyannapatrudu son vijay condemns illegal mining business | Sakshi
Sakshi News home page

వాటితో నాకు సంబంధం లేదు: విజయ్‌

Jun 27 2017 9:33 AM | Updated on Sep 5 2017 2:36 PM

ఆ వ్యాఖ్యలు బాధ కలిగించాయి: విజయ్‌

ఆ వ్యాఖ్యలు బాధ కలిగించాయి: విజయ్‌

రాష్ట్రంలో ఎక్కడా మైనింగ్‌ వ్యాపారాలతో తనకు సంబంధం లేదనీ.. అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న తనపై ...

విశాఖ : రాష్ట్రంలో ఎక్కడా మైనింగ్‌ వ్యాపారాలతో తనకు సంబంధం లేదనీ.. అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న తనపై మావోయిస్టు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించిందని రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

విశాఖపట్నం జిల్లా జీకే వీధి మండలంలోని సరుగుడు క్వారీ వెలికితీతలో విజయ్‌కు పెద్ద మొత్తంలో షేర్లున్నాయని, దాన్ని అడ్డుకోవాలంటూ మావోయిస్టు పార్టీ తూర్పు డివిజన్‌ కమిటీ కార్యదర్శి కైలాసం పేరుతో ఓ ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన విజయ్‌.. తనకు మైనింగ్‌ వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయనడం సత్యదూరమన్నారు. అబ్బాయి రెడ్డి, శ్రీనులతో తనను ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement