నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి కావలి ఎమ్మెల్యేగా ఎన్నికైన రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అభినందనలు తెలిపారు.
కావలి, న్యూస్‌లైన్: నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి కావలి ఎమ్మెల్యేగా ఎన్నికైన రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అభినందనలు తెలిపారు. నెల్లూరులోని మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ఆయన స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని కలిసి అభినందలు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని ప్రతాప్‌కుమార్‌రెడ్డి కలిసి చర్చించారు. జిల్లాపరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని కూడా కలిశారు.
ఈ సందర్భంగా వారందరు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని అభినందించారు. ప్రతాప్‌కుమార్‌రెడ్డి వెంట ముసునూరు పీఏసీఎస్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ అల్లూరు మండల కన్వీనర్ దండా కృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు మేడా అశోక్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు డేగా రాము, ప్రళయకావేరి మల్లికార్జున ఉన్నారు.