breaking news
sri dhar reddy
-
పాటలతో మంగ్లీ ఎన్నికల ప్రచారం
నల్లమాడ: వైఎస్సార్సీపీ పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం కోసం యువ గాయిని మంగ్లీబాయి ఆదివారం నల్లమాడకు విచ్చేశారు. స్థానిక బస్టాండ్ కూడలిలో ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డిని ఉద్ధేశించి ఆమె పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి వేలాదిగా తరలివచ్చి నాయకులు, కార్యకర్తలు, యువకులు, గిరిజన మహిళలు పాటలకు అనుగుణంగా కేరింతలు కొడుతూ చిందులు వేశారు. అనంతరం మంగ్లీబాయి మాట్లాడుతూ జగనన్నతోనే రాజన్న రాజ్యం సాధ్యమన్నారు. ఈనెల 11న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి పుట్టపర్తి ఎమ్మెల్యేగా దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డిని, హిందూపురం ఎంపీగా గోరంట్ల మాధవ్‌ను గెలిపించాలన్నారు. పంచాయతీలుగా గుర్తిస్తామనడం హర్షణీయం ఐదువేల జనాభా ఉన్న గిరిజన తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తిస్తామని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇవ్వడం హర్షణీయమని మంగ్లీ అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట సతీమణి దుద్దుకుంట అపర్ణారెడ్డి, గిరిజన సంఘం జాతీయ నాయకులు వడిత్యా శంకర్‌నాయక్, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పొరకల రామాంజనేయులు, ఎస్టీ సెల్ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు కుళ్లాయినాయక్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎంపీ మేకపాటికి రామిరెడ్డి అభినందన
కావలి, న్యూస్‌లైన్: నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి కావలి ఎమ్మెల్యేగా ఎన్నికైన రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అభినందనలు తెలిపారు. నెల్లూరులోని మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ఆయన స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని కలిసి అభినందలు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని ప్రతాప్‌కుమార్‌రెడ్డి కలిసి చర్చించారు. జిల్లాపరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని కూడా కలిశారు. ఈ సందర్భంగా వారందరు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని అభినందించారు. ప్రతాప్‌కుమార్‌రెడ్డి వెంట ముసునూరు పీఏసీఎస్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ అల్లూరు మండల కన్వీనర్ దండా కృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు మేడా అశోక్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు డేగా రాము, ప్రళయకావేరి మల్లికార్జున ఉన్నారు.