కేరళ వరద బాధితులకు మేకపాటి రూ.కోటి విరాళం

Mekapati Goutham Reddy Donation for Kerala flood victims - Sakshi

28,29 తేదీల్లో కేరళ సీఎంను కలిసి ఇవ్వనున్న ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతుగా రూ.కోటి విరాళాన్ని కేఎంసీ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ చైర్మన్, నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌ రెడ్డి చెప్పారు. ఈ విరాళాన్ని కేరళ సీఎం సహయనిధికి అందజేయనున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28,29 తేదీల్లో స్వయంగా కేరళ వెళ్లి ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలిసి డీడీని అందజేసి, వరద బాధితుల పునరావసం, ఇతర కార్యక్రమాల కోసం వినియోగించుకోవాలని కోరతారని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top