వివాహిత ఆత్మహత్య | married woman committed suicide in srikakulam | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Mar 4 2018 11:22 AM | Updated on Mar 4 2018 11:22 AM

గార: వివాహం జరిగి కొద్ది నెలలు కూడా అవకముందే అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో కన్నవారికి చెప్పుకోలేక.. అత్తింటి బాధలు భరించలేక వివాహత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కొత్తూరు సైరిగాంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లావేరు మండలం బయ్యానిపేటకు చెందిన ఆరంగి పావని (19)తో  ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న సైరిగాం గ్రామానికి చెందిన ఆరంగి సత్యనారాయణకు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. ఆ సమయంలో రూ.8లక్షలు కట్నంతో పాటు ఆరు తులాల బంగారం ఇచ్చారు. వీటితో పాటు ఇతర సామగ్రిని కూడా అందజేశారు.

అదనంగా కట్నం తెమ్మని అత్తింటివారు వేధిస్తున్నా ఆ బాధలన్నీ దిగమింగింది. తన కష్టాన్ని కన్నవారి దగ్గర చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుంది. చీర కొంగుతో ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్ప డింది. మృతురాలి తండ్రి పోలాకి గోవిందరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ బూర ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ వి. భీమారావు, తహసీల్దార్‌ ఎ.సింహాచలం పరిశీలించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement