పెళ్లి బృందం వాహనాన్ని ఢీకొట్టిన లారీ | Married the band's vehicle off-centered impact in road accident | Sakshi
Sakshi News home page

పెళ్లి బృందం వాహనాన్ని ఢీకొట్టిన లారీ

Aug 30 2013 4:55 AM | Updated on Aug 30 2018 3:56 PM

పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టిన ప్రమాదంలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గురువారం బెల్లంకొండ మండలం కందిపాడు వద్ద చోటుచేసుకుంది.

బెల్లంకొండ/ సత్తెనపల్లి, న్యూస్‌లైన్ : పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టిన ప్రమాదంలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గురువారం బెల్లంకొండ మండలం కందిపాడు వద్ద చోటుచేసుకుంది. అచ్చంపేటలో జరిగే పెళ్లికి హాజరయ్యేందుకు గురువారం రెంటచింతల నుంచి బంధువులు తుఫాన్ వాహనంలో బయలుదేరారు.
 
 కందిపాడు వద్ద వీరి వాహనాన్ని ఇసుక లోడుతో వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాచర్లకు చెందిన డ్రైవర్ షేక్ అబ్దుల్ అజీమ్‌తోపాటు రెంటచింతల వాసులు దాసిరెడ్డి పుల్లారెడ్డి, శీలం ఆంజనేయులు, పి.వెంకట్రామయ్య, పద్మా, జవ్వాజి తులశమ్మ, ఆకుల జయమ్మ, బచ్చు నాగరాజు, మామిడి అనసూర్యమ్మ, లక్ష్మీనాగేశ్వరిలకు గాయాలయ్యాయి. 
 
 బాధితులను సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమించడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని స్థానిక ఎస్‌ఐ నజీర్‌బేగ్, హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు తదితరులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement