'మనం' సినిమా వీడియో పాటలు యూట్యూబ్లో అప్లోడ్ | Manam video songs upload in youtube | Sakshi
Sakshi News home page

'మనం' వీడియో పాటలు యూట్యూబ్లో అప్లోడ్

Mar 8 2014 6:10 PM | Updated on Aug 13 2018 4:19 PM

మనం చిత్రంలోని దృశ్యం - Sakshi

మనం చిత్రంలోని దృశ్యం

టాలీవుడ్ను పైరసీభూతం వెంటాడుతోంది. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు చివరగా నటించిన అన్నపూర్ణ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన 'మనం' సినిమా విడుదల కాకముందే పాటల వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేశారు.

హైదరాబాద్: టాలీవుడ్ను పైరసీభూతం వెంటాడుతోంది. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు చివరగా నటించిన అన్నపూర్ణ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన 'మనం' సినిమా విడుదల కాకముందే పాటల వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. దీనికి సంబంధించి  హైదరాబాద్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో  అక్కినేని నాగేశ్వరరావు తన కుమారుడు నాగార్జున, మనవడు నాగచైతన్యలతో కలిసి నటించారు.  వాట్స్ప్ నుంచి ఈ సినిమా పాటలను యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేడంతోపాటు యూట్యూబ్ నుంచి ఆ వీడియో పాటలను తొలగించారు.

ఇంతకు ముందు సినిమాలు విడుదలైన తరువాత పైరసీ సిడిలు బయటకు వచ్చేవి. ఇప్పుడు సినిమా విడుదల కాకముందే పైరసీ సిడిలు  బయటకు వస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో  బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా  పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'అత్తారింటికి దారేది? చిత్రం పైరసీ సిడి విడులకు ముందే బయటకు వచ్చిన విషయం తెలిసిందే.  ఇప్పుడు మనం సినిమా పాటల వీడియోని ఏకంగా యూట్యూబ్లోనే అప్లోడ్ చేశారు. దీంతో తెలుగు నిర్మాతలు బెంబేలెత్తిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement