వడ్డీ వ్యాపారుల వేధింపులతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి పురుగుల మందు తాగాడు.
వేధింపులతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
Mar 3 2016 10:48 AM | Updated on Oct 9 2018 5:39 PM
మదనపల్లె : వడ్డీ వ్యాపారుల వేధింపులతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి పురుగుల మందు తాగాడు. చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని మీరుగట్టువారిపల్లెకు చెందిన అనిల్‌కుమార్ చేనేత కార్మికుడు. కుటుంబపోషణ, పిల్లల చదువుల కోసం రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు.
వాటిని తీర్చేందుకు ఇల్లు సైతం అమ్మేశాడు. వడ్డీ వ్యాపారులు మిగిలిన అప్పు తీర్చాలంటూ గురువారం ఉదయం ఇంటి వద్దకు వచ్చి గొడవకు దిగారు. దీంతో మనస్తాపం చెందిన అనిల్‌కుమార్ పురుగు మందు తాగాడు. వెంటనే కుటుంబసభ్యులు మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
Advertisement
Advertisement