ఓ కేసులో క్రైమ్ విభాగానికి సంబంధించిన పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి మృతి చెందడం స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది
పోలీసులే కొట్టి చంపారు: మృతుని బంధువుల ఆరోపణ
Sep 9 2014 7:31 PM | Updated on Sep 2 2017 1:07 PM
కాకినాడ: ఓ కేసులో క్రైమ్ విభాగానికి సంబంధించిన పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి మృతి చెందడం స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. ఓ కేసు విచారణ నిమిత్తం వెంకటరమణ అనే వ్యక్తిని టూటౌన్ పీఎస్ పోలీసులు తీసుకొచ్చారు.
నిందితుడు వెంకటరమణను తీసుకొచ్చిన కొద్ది సేపటికే మృతి చెందాడు. దాంతో వెంకటరమణను పోలీసులే కొట్టి చంపారంటూ మృతుడి బంధువులు ఆరోపించారు. పోలీసులు కొట్టి చంపారంటూ మృతుని బంధువులు పోలీస్ స్టేషన్ బయట బైటాయించారు. దాంతో పోలీసు స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గందరగోళం నెలకొంది.
Advertisement
Advertisement