పిడుగుపాటుకు గుండె ఆగిపోయి ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం 74ఉడేగోలం గ్రామంలో గురువారం జరిగింది.
రాయదుర్గం(అనంతపురం జిల్లా): పిడుగుపాటుకు గుండె ఆగిపోయి ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం 74ఉడేగోలం గ్రామంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గుమ్మగల్లు మండలం రంగచేడ్ గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే గురువారం 74ఉడేగోలం గ్రామంలో ఉల్లినారుకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. అయితే గురువారం భయంకరంగా పిడుగుశబ్దాలు, ఈదురుగాలులు వీచాయి.ఆ సమయంలో తన సమీపంలో పిడుగుపడటంతో భయంతో రామాంజనేయులు గుండె ఆగిపోయి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. విషయం తెలిసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.