వేగంగా వెళ్తున్న బైక్ ముందు ప్రయాణిస్తున్న టిప్పర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
గుంటూరు : వేగంగా వెళ్తున్న బైక్ ముందు ప్రయాణిస్తున్న టిప్పర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రొంపిచర్ల మండలం విరాటం గ్రామానికి చెందిన అచ్చి వెంకటేశ్వర్లు, రాఘవులు అనే ఇద్దరు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వెళ్తూ ముందు ప్రయాణిస్తున్న టిప్పర్ వాహనాన్ని ఢీ కొన్నారు. దీంతో బైక్ వెనుక నుంచి టిప్పర్ వాహనంలో ఇరుక్కుపోవడంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రాఘవులుని మెరుగైన వైద్యం కోసం చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.