కుటుంబకలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం పొడగట్లపల్లిలో ఆదివారం ఉదయం జరిగింది.
రావులపాలెం (తూర్పుగోదావరి) : కుటుంబకలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం పొడగట్లపల్లిలో ఆదివారం ఉదయం జరిగింది. వివరాల ప్రకారం.. పొడగట్లపల్లి గ్రామానికి చెందిన పెంటయ్య(42) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా గత కొన్ని రోజులుగా కుటుంబసభ్యులతో గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో మనస్తాపానికి గురైన పెంటయ్య ఆదివారం ఉదయం పురుగుల మందు తాగాడు. ఆ తర్వాత మద్యం సేవించడం కోసం మద్యం దుకాణానికి వెళ్లి అక్కడే పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.