నేటి ముఖ్యాంశాలు

Major Events On 11th November - Sakshi

జాతీయ విద్యాదినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో నేడు అబుల్‌ కలాం విద్యా పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుంది. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్‌లో సోమవారం జరిగే ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని ప్రతిభావంతులకు విద్యాపురస్కారాలు అందజేస్తారు. ఉదయం 10 గంటలకు  కార్యక్రమం ప్రారంభం కానుంది.

► ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 38 వ రోజుకు చేరింది. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది. ఆర్టీసీ రూట్లను ప్రైవేటుపరం చేయడంపై హైకోర్టులో సోమవారం విచారణ జరుగనుంది. ఆర్టీసీ స​మ్మెపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయనుంది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై నివేదిక సమర్పించనుంది.

మహారాష్ట్ర రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు వెనకడుగు వేయడంతో.. రెండో అతిపెద్ద పార్టీకి శివసేనకు అవకాశ దక్కింది. ప్రభుత్వానిన ఏర్పాటు చేయాలని గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారి శివసేనను ఆహ్వానించారు. ఈరోజు సాయంత్రం లోపు ప్రభుత్వాన్ని చేయాలని డెడ్‌లైన్‌ విధించారు.

► నేడు హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల ఇరిగేషన్‌ సదస్సు జరుగుతుంది. కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌  ఈ కార్యక్రమానికి హాజరకానున్నారు. నదు అనుసంధానమే ప్రధాన ఎంజెడగా సదస్సు జరగనుంది.

నేడు కార్తీక సోమవారం కావడంతో శివనామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి.

భాగ్యనగరంలో నేడు..

  • తెలుగు, హిందీ సినీ సంగీత విభావరి
    -వేదిక : శ్రీ త్యాగరాయ గాన సభ -సమయం: సాయంత్రం 4 గంటలకు  
  • మండే వింటేజ్‌ నైట్‌
    -వేదిక: 10 డౌన్‌ స్ట్రీట్, బేగంపేట -సమయం : రాత్రి 8 గంటలకు 
  • డిజిటల్‌ వరల్డ్‌ ఆధ్వర్యంలో గ్లోబల్‌ పోలీసింగ్‌ సమ్మిట్‌
     -వేదిక: హైటెక్స్‌  -సమయం : ఉదయం 9 గంటలకు. 
  • మండే ఈడిఎం నైట్‌ విత్‌ డిజే అభిషేక్‌
     -వేదిక: స్పోయిల్‌ పబ్‌ -సమయం: రాత్రి 8 గంటలకు 
  • శ్రీ చక్ర దీపోత్సవం
    -వేదిక : ఎల్‌బీ స్టేడియం -సమయం: రాత్రి 9 గంటలకు. 
  • వాలీబాల్, బాస్కెట్‌ బాల్‌ సెలక్షన్స్‌
    -వేదిక: ఆర్ట్స్‌ అండ్‌ సోషల్‌ సైన్స్, ఉస్మానియా వర్శిటీ కాలేజీ(టూరిస్టు స్పాట్‌) -సమయం: ఉదయం 10.30 గంటలకు. 
  • తెలంగాణ యువ నిత్యోత్సవం
    -వేదిక: రవీంద్ర భారతి -సమయం: సాయంత్రం 6 గంటలకు. 
  • ఆది ధ్వని.. ఎగ్జిబిషన్‌
    -వేదిక: తెలంగాణ స్టేట్‌ ఫైన్‌ ఆర్ట్‌ గ్యాలరీ  -సమయం : ఉదయం 10.30 గంటలకు 
  • ఆల్‌ ఇండియా ఫైడ్‌-రేటింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌
    -వేదిక: లక్ష్మి గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌ -సమయం: ఉదయం 8 గంటలకు. 
  • ఇంటర్నేషల్‌ ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ కాంగ్రెస్‌
    -వేదిక: హెచ్‌ఐసీసీ -సమయం: ఉదయం 9 గంటలకు  
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top