డిసెంబరులో అరసవల్లిలో మహసౌరయాగం | Mahasowra Yagam in Arasavalli | Sakshi
Sakshi News home page

డిసెంబరులో అరసవల్లిలో మహసౌరయాగం

Aug 10 2013 8:32 PM | Updated on Aug 20 2018 4:00 PM

అరసవల్లి సూర్యదేవాలయం - Sakshi

అరసవల్లి సూర్యదేవాలయం

అరసవల్లిలోని అతిపురాతన సూర్య దేవాలయంలో డిసెంబర్ 18 నుంచి 30 వరకు మహసౌరయాగం నిర్వహించనున్నారు.

శ్రీకాకుళం: అరసవల్లిలోని అతిపురాతన  సూర్య దేవాలయంలో డిసెంబర్ 18 నుంచి 30 వరకు మహసౌరయాగం నిర్వహించనున్నారు. భారీ ఎత్తున నిర్వహించతలపెట్టిన   ఈ యాగంలో దేశవ్యాప్తంగా ఉన్న అర్చక పండితులంతా పాల్గొననున్నారు.

 శ్రీ సూర్య నారాయణ  ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్ర వర్మ నిర్మినట్లు  ఇక్కడ లభిస్తున్న శాసనాల వల్ల తెలుస్తోంది. హర్షవల్లి అనే ప్రాచీన పేరు అరసవల్లిగా  మారిందనేది చరిత్రకారుల అభిప్రాయం.  ఈ దేవాలయంలో సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు గర్బ గుడిలో ఉన్న  మూలవిరాట్టు పాదాలను తాకడం ఇక్కడి ప్రత్యేకత.

ఈ ఏడాది  ఉగాది (11-04-2013) రోజున   భారత తపాలా శాఖ   అరసవల్లి  సూర్య దేవాలయం ,   శ్రీకూర్మంలోని కూర్మనాధ స్వామి ఆలయం బొమ్మలతో తపాల  బిళ్లలను విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement