మద్యం మాఫియా గుప్పిట్లో ప్రభుత్వం | Mafia decided to alcohol from govt - narayana | Sakshi
Sakshi News home page

మద్యం మాఫియా గుప్పిట్లో ప్రభుత్వం

Jun 16 2014 2:20 AM | Updated on Aug 17 2018 7:48 PM

మద్యం మాఫియా గుప్పిట్లో ప్రభుత్వం - Sakshi

మద్యం మాఫియా గుప్పిట్లో ప్రభుత్వం

ప్రభుత్వం మారినా రాష్ట్రంలో మద్యం మాఫియా అధికారం చెలాయిస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. నారాయణ అన్నారు.

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ

తిరుపతి: ప్రభుత్వం మారినా రాష్ట్రంలో మద్యం మాఫియా అధికారం చెలాయిస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. నారాయణ అన్నారు. తిరుపతిలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మద్యం మాఫియాకు అడ్డుకట్ట వేయాలంటే నూతన విధానం ప్రవేశ పెట్టక తప్పదన్నారు. మద్యం విధానాన్ని తమిళనాడు తరహాలో తీసుకువచ్చి ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపించాలన్నారు.

ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చిన కేసీఆర్, చంద్రబాబు అధికారం చేపట్టాక వాటిని అమలు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్న చంద్ర బాబు ఆ తరువాత కమిటీ నియామకంపై సంతకం చేసి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement